ప్రభుత్వం ఇస్తున్న ఉచితసలహాలు పాటిస్తామా ఇలా

ప్రభుత్వం —ఉచిత సలహాలు
1 ]  కరెంటు కోత గురించి  ఆలోచించవద్దు .
    మరీ ఉక్కపోస్తే కిటికీలు తెరిచి పెట్టుకోండి .
    చల్లని గాలిని చక్కగా అనుభవించండి .
    ఆరుబయట దోమతెరలు కట్టుకుని హాయిగా నిదురపో ౦డి
2]  కరెంటు ఆదా చెయ్యండి .
   ఆదా ఎలా చెయ్యాలో నేర్చుకోండి
  ౧]  హై మాస్టు దీపాలు మాని ట్యూబు లైట్లు వెలిగించుకోండి
      అదీ వీలు లేకుంటే  కిరోసిన్ తో బుడ్డి దీపాలు పెట్టు కొండి
  ౨]  గీజర్లు వాడడం మానండి .
       చన్నీటి స్నానం  కు అలవాటు పడండి
      ఆరోగ్యానికి ఆరోగ్యం ….ఆదా కి ఆదా
 ౩] వాషింగు మిషన్లు  వాడటం మానండి .
  ఒక అరగంట చేతికి పని చెప్పితే బాగా మురికి పోయి
   మీ బట్టలు మెరుస్తాయి !!!
    అంతే కాదు శరీరానికి మంచి excersise  కూడా .
   ఆరోగ్యం ఇంకా మెరుగు పడుతుంది
౪] రెఫ్రిజిరేటర్ వాడ వద్దు .
   దీని మరో పేరు సద్దిపెట్టె..దీని ఆఫ్ చేస్తే కరెంటు ఆదా నే కాదు ,
   సద్ది కూడు తినే బాధ తగ్గుతుంది !!
   ఏ పూట కా పూట తాజాగా చేసుకు తింటే ఆరోగ్యం మరింత మెరుగు !!
౫] టి. వీ లు  చూడటం మానండి .
    ఇంటి అరుగు మీద కూర్చుంటే బోల్డు కబుర్లు !
   ఏళ్ళ తరబడి ససేషం  గా నడిచే టి వీ సీరియళ్ళ కన్న
   ఎప్పటికప్పుడు తాజా గా సమాచారం , రోజు కో కొత్త కథనం ..లభ్యం !!
౬]  మైక్రో అవన్లు మానెయ్యండి .
    చిన్న బొగ్గుల కుంపటి కొనుక్కోండి
    వేడి చేసు కోవడం సులభమే కాదు , చాలా డబ్బు ఆదా కూడా
          చక్కటి ప్రకృతి లో స్వేచ్చ గా గాలిని ఆస్వాదిస్తూ , చన్నీటి స్నానంతో  ఆరోగ్యాలు చక్కబడి ఎంతో శక్తి వస్తుంది . అప్పుడు  ఆలోచనలు మారతాయి .
వర్షాలు లేకనే కదా ఇన్ని కష్టాలు !! వరుణ దేవుడిని కరుణించమని వేడుకుందాం ,ఆయనకీ “ క్విడ్ ప్రో కో “గురించి చెబుదాం ఆయనమనకు వర్షం ఇస్తే ఆయనకు మనం ఏమీ ఇస్తామో డిస్కస్ చేద్దాం..అయినా న్యాయ నిర్నేతలే
“బెయిలు” కొసం కోట్లు తినడం సాద్యం అయినప్పుడు ..దేవుడిని లొంగ తీసుకోలేమా ?  ఆలోచిద్దాం ..
          ప్రభుత్వం మంత్రుల పై చార్జిషీట్ల తో , వాళ్ళ రాజీనామాలతోను , బొగ్గుల రాజకీయాలతో బిజీగా వుందికదా ..
మనతిప్పలు మనమే పడదామా?
Posted in Uncategorized | వ్యాఖ్యానించండి

Hello world!

Welcome to WordPress.com! This is your very first post. Click the Edit link to modify or delete it, or start a new post. If you like, use this post to tell readers why you started this blog and what you plan to do with it.

Happy blogging!

Posted in Uncategorized | 1 వ్యాఖ్య